GDWL: గద్వాల కేంద్రంలో నిర్వహించిన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, టాపర్ల సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి విజయానికి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, వారి బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయులు కూడా అంతే కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థి విజయానికి ఉపాధ్యాయుడు కీలకం: MLA


