ADB: గుడిహత్నూర్ మహంకాళి గల్లీలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. బాధితురాలు దుర్వ రాధ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. రూ.85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చోరీ వస్తువులను కనుగోలు చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు SI శ్రీకాంత్ తెలిపారు.
తెలంగాణ
చోరీ కేసును చేధించిన పోలీసులు


