ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో గత కొన్నిరోజులుగా నీటి సరఫరా పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతుండటంతో మంచినీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా మహాలక్ష్మివాడ, జై జవాన్ నగర్, చిలుకూరి లక్ష్మినగర్ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ట్యాంకర్ ద్వారా నీటిని పంపిణీ చేశారు.
తెలంగాణ
నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ ద్వారా సరఫరా


