హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం: విలాస్

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసారిలో 78వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమరయోధుల స్తూపాల వద్ద సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.విలాస్, నాయకులు నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన ఈ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.