హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

MDK: శివ్వంపేట మండలం బిజిలీపూర్‌లో నీరుడి పోచయ్య (40) అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం నుంచి కనిపించని పోచయ్య, శనివారం తన పొలం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గతంలో బియ్యం విక్రయ డబ్బుల విషయంలో గొడవలు జరగడంతో, వారే హత్య చేసి ఉంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు నిజాలు బయటపడతాయని ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.