హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీతారం ఏచూరి ఆశయాలే స్ఫూర్తి'

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు అన్నారు. కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం ఆయన చూపిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.