హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్‌ పాలన పూర్తిగా విఫలమైంది'

BHNG: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ మునుగోడు నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు ఆందోజు శంకరాచారి విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.