MBNR: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అ. కలెక్టర్ హరిప్రియ స్పష్టం చేశారు. శనివారం 'SIR 2026' ప్రత్యేక ప్రచారంలో భాగంగా జడ్చర్ల మండలం రంగాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అ. కలెక్టర్


