హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

KNR: గంగాధర మండలం ఒద్యారాం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు గంగాధర పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై వంశీకృష్ణ కోరారు.