హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే: సీపీఎం

BDK: కొత్తగూడెం మండలంలో శనివారం నిర్వహించిన సీపీఎం సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్‌ మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేది కమ్యూనిస్టులేనన్నారు. సీతారాం ఏచూరి సేవలను కొనియాడుతూ, ఇండియా కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.