హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెల్లివిరిసిన మత సామరస్యం!

NZB: చందూర్ మండల కేంద్రంలో శనివారం మత సామరస్యం వెల్లివిరిసింది. ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు పరస్పరం సోదరభావంతో మెలిగారు. శివాజీ విగ్రహ ప్రారంభోత్సవంలో మైనార్టీ సోదరులు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.