హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి పాలిటెక్నిక్‌లో నీటి ట్యాంకు శిథిలావస్థ

WNP: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఈ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. ఈ ట్యాంకు ఏ సమయంలో కూలిపోతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ట్యాంకు బలహీనమైన పిల్లర్లుకు బెచ్చులు ఊడిపోయి సీకులు తేలి బయట కనబడుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరగకముందే శిథిలావస్థ ట్యాంకును తొలగించాలన్నారు.