హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: CI

MHBD: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కేసముద్రం సీఐ సత్యనారాయణ అన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. గణేష్ ఆగమనం, ఊరిగింపులలో డీజేలకు పర్మిషన్ లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం పూర్తి స్థాయి నిఘా ఉంటుందని, శాంతి భద్రతల్లో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.