హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతికి CPR చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు

WGL: వర్ధన్నపేట పట్టణంలో విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడిన వానరానికి ఓయువకుడు CPR చేసి ప్రాణాలు కాపాడాడు. శనివారం ట్రాన్స్‌ఫార్మర్‌పైకి వెళ్లిన వానరం కరెంట్‌ షాక్‌కు గురై కిందపడటాన్ని గమనించిన యువకుడు వెంటనే స్పందించి సీపీఆర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత వానరం కళ్లు తెరిచి కోలుకుంది. అనంతరం నీరు తాగించి వదిలేయగా, అది సాధారణంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.