MBNR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో శనివారం ఎంపీ డీకే అరుణ అమరవీరులకు నివాళులర్పించారు. 1947లో రజాకారుల కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17ను తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
అమరవీరులకు డీకే అరుణ నివాళులు


