హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ ఇవ్వాలని రైతులు రోడ్డుపై రాస్తారోకో

వనపర్తి-పెబ్బేరు రహదారిపై వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని రైతులు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. సవాయిగూడెం, పెద్దగూడెం, క్రిష్ణగిరి, నాచహళ్లి గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఏఈ చంద్రశేఖర్ 12 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.