హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భక్తితో పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం'

BHPL: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మట్టి గణేశుడి ప్రతిమలను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి హాని లేకుండా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చన్నారు. ప్రజలంతా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు.