హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD-బెంగూళూర్ హైవేపై 2 కి.మీ. ట్రాఫిక్ జామ్

HYD-బెంగూళూర్ జాతీయ రహదారిపై పెద్దషాపూర్ నుంచి తిమ్మాపూర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ రద్దీలో బైక్ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని వాహనదారులు కోరుతున్నారు.