హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో నకిలీ టీటీడీ ఉద్యోగి అరెస్ట్

TPT: తిరుమల భక్తులను మోసం చేస్తున్న నకిలీ టీటీడీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు టీటీడీ ఉద్యోగినని చెప్పుకుంటూ భక్తులను నమ్మించి దర్శనం, టికెట్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ టీటీడీ ఐడీ కార్డుతో పాటు రియల్‌మీ మొబైల్‌ఫోన్‌ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20 మందికి పైగా భక్తులను మోసం చేసినట్లు విచారణలో తేలింది.