హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన రాజగోపుర నిర్మాణం ప్రారంభం

కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురంలోని శ్రీ దుర్గాపార్వతి సమేత సోమేశ్వర స్వామి నూతన రాజగోపురం నిర్మాణ పనులు శనివారం చేపట్టారు. భక్తుల విరాళాలు రూ.18లక్షలతో నిర్మించ తలపెట్టిన మూడు అంతస్తుల రాజగోపుర నిర్మాణ పనులను నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పూజలు చేసి ప్రారంభించారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ పెద్దలను అభినందించారు.