హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయినగర్‌లో తాగునీటి కోసం రాస్తారోకో!

ప్రకాశం: దర్శి మండలం సాయినగర్‌లో శనివారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గ్రామానికి తాగునీరు సరఫరా కావడం లేదని, సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు విస్మరిస్తున్నారని విమర్శించారు.