హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీతో ప్రజలకు ఇబ్బందులు

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని రోడ్డుపై డ్రైనేజీ నీరు పొంగిపారుతోంది. మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పారిశుధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.