హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీజేలకు అనుమతి లేదు'

AKP: అచ్యుతాపురం గణేష్‌ మండపాలు, నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. అసభ్యకర డ్యాన్సులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండపాల వద్ద రాత్రివేళ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ వైరింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి నిమజ్జనానికి నీటిలోకి దిగొద్దని హెచ్చరించారు.