E.G: రాజమండ్రి విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. చెన్నై నుంచి గన్నవరం బయలుదేరిన విమానం మార్గమధ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలట్ రాజమండ్రి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వాతావరణ పరిస్థితుల కారణంగానే విమానాన్ని రాజమండ్రిలో దించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో విమానం అత్యవసర ల్యాండింగ్


