కోనసీమ: మండపేట నియోజకవర్గ పరిధిలోని నరాలవారిపాలెం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.63 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం తెలిపారు. సోమేశ్వరం నుంచి పసలపూడి మీదుగా నరాలవారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద చేపట్టేందుకు ఈ నిధులు మంజూరయ్యాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు నిర్మాణానికి రూ.1.63 కోట్లు మంజూరు


