హైదరాబాద్: 28°C
క్రీడలు

131 ఏళ్ల రికార్డు సమం చేసిన మానవ్ సుతార్

కౌంటీ క్రికెట్లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అదరగొడుతున్నాడు. గ్లామోర్గన్‌తో మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడు వికెట్లు తీసిన సుతార్.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 131 ఏళ్ల క్రితం టామ్ హేవార్డ్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీసి, పరుగులేమీ ఇవ్వని ఘనతను హేవార్డ్ తర్వాత సుతార్ సాధించాడు.