హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMSలో పనిచేయని లిఫ్టులు.. రోగుల కష్టాలు.!

HYD: పంజాగుట్టలోని NIMS ఆసుపత్రిలో న్యూ, ఎమర్జెన్సీ బ్లాకుల్లో లిఫ్టులు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన వారు మెట్లు, ర్యాంపుల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అలసిపోతున్నారు. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని రోగుల కుటుంబీకులు తెలిపారు. అత్యవసర విభాగాల్లో లిఫ్టులు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు.