AKP: నర్సీపట్నం టౌన్ SI ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడ్డారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, వాహనాల రికార్డులు లేకపోవడంతో గంట వ్యవధిలో సుమారు 25 కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గంటలో 25 కేసులు నమోదు'


