హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒక్కటే 'మీ సేవ'.. ఇబ్బందుల్లో ప్రజలు

SRPT: మోతే మండల కేంద్రంలో రెండు 'మీ సేవ' కేంద్రాలు మంజూరైనా ప్రస్తుతం ఒక్కటే నడుస్తుండటంతో, మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 29 గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.‌‌ వెంటనే సంబంధిత శాఖ అధికారులు రెండవ మీ సేవను ప్రారంభించాలని మండల ప్రజలు కోరుతున్నారు.