హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో రైతు మృతి

NGKL: తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ తండాలో పాత్లావత్ సక్రు నాయక్(42) యాసిడ్ తాగి మృతిచెందారు. అప్పు చేసి ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫామ్‌లో వ్యాధులతో 10 వేల కోళ్లు మృతి చెందాయి. సాగునీటి కోసం వేసిన రెండు బోర్లలో నీరు పడక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.