హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వినోబాభావే జయంతి

శ్రీకాకుళం: భూదాన ఉద్యమానికి నాంది పలికిన ఆచార్య వినోబాభావే జయంతిని శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్మృతివనంలో నిర్వహించారు. వినోబాభావే విగ్రహానికి విగ్రహ దాతలు కొఠారి రామకృష్ణ, జ్యోతి దంపతులు, గాంధీ మందిర ప్రతినిధులు పూలమాలలు వేశారు. అహింస, గాంధేయ మార్గంలో సాగిన వినోబాభావే సేవలను కొనియాడారు.