హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగబాబుకు భోగాపురంలో ఘన స్వాగతం

VZM: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఘన స్వాగతం పలికారు. ఎచ్చెర్ల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నాగబాబును జనసేన నాయకులు, కార్యకర్తలు భోగాపురం విమానాశ్రయంలో ఆత్మీయంగా కలిశారు. అనంతరం నాగబాబు ఎచ్చెర్లకు బయలుదేరారు.