ATP: వైసీపీ సీనియర్ నాయకుడు స్వర్గీయ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తోపుదుర్తి గ్రామంలోని ఆయన తోట దగ్గర ఉన్న ఘాట్ వద్ద నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శనివారం తోపుదుర్తి కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. భాస్కర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తోపుదుర్తి భాస్కర్ రెడ్డికి జిల్లా అధ్యక్షుడి నివాళులు


