హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్రాలో పోషణ్‌ మాసం కార్యక్రమం

ASR: అరకులోయ మండలం, శిరగం పంచాయతీ వర్రా గ్రామంలో పోషణ్‌ మాసం కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ లక్ష్మీ లావణ్య, సూపర్వైజర్ లక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్త బంగారమ్మ‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకాహారం, బాలల వికాసంపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు ప్రధానమంత్రి మాతృ వందన పథకం ప్రయోజనాలను పొందాలని సూచించారు.