హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.. స్పాట్ డెడ్..!

WGL: దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామ సమీపంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వరంగల్న-నర్సంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారి గిన్నె కట్టస్వామిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కట్టస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, ప్రమాదంపై విచారణ చేపట్టారు.