హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీని ప్రశంసించిన సీఎం

కృష్ణా: మహిళలపై నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ కృషిని సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రశంసించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించడంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది. గత యేడాదితో పోలిస్తే 36% నేరాలు తగ్గాయి. యేడాదిన్నరలో 25 మందికి శిక్షలు పడేలా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేసింది.