హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

కోనసీమ: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ద్వారపూడి బంగారమ్మ కాలనీలోని దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద శనివారం దివంగత సుంకర వెంకటరమణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ సుంకర నాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర నాని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.