హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ బాడుగల బకాయిలు.. ఆరుగురిపై కేసు

ATP: లారీ బాడుగల బకాయిలు చెల్లించకుండా మోసం చేశారనే ఫిర్యాదుతో తాడిపత్రి రూరల్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. శ్రీ చేతన సాయి లాజిస్టిక్స్ సంస్థకు 24 మంది లారీ యజమానులు వాహనాలను లీజుకు ఇచ్చారు. మొత్తం రూ.70 లక్షల బకాయిలకు రూ.21 లక్షలు చెల్లించి, మిగిలిన రూ.49,35,900 ఎగ్గొట్టారని షేక్షావలి ఫిర్యాదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.