హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి మరిన్నీ రైలు కనెక్టివిటీలు

తిరుపతి నుంచి పొరుగు రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రేణిగుంట-అరకోణం మధ్య 3, 4వ రైల్వే లైన్ల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గం పూర్తయితే తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రైలు ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణికులతో పాటు పారిశ్రామిక రవాణాకు కూడా ఈ రైల్వే లైన్లు ఉపయోగపడనున్నాయి.