హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంభంలో మెగా జాబ్‌మేళా

ప్రకాశం: కంభంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, విద్యార్హతలు, ఎంపిక విధానంపై అధికారులు అవగాహన కల్పించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలన్నారు.