అన్నమయ్య: బి.కొత్తకోట మండలంలో శనివారం ఉదయం ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. కాయలవారిపల్లికి చెందిన రాజేంద్ర (23), హరికృష్ణ (28)లు అంగళ్లు వెళ్తుండగా నాయినబావి కోళ్ల ఫారం వద్ద ప్రమాదం జరిగింది. హరికృష్ణ కాలు తీవ్రంగా గాయపడటంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. రాజేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు


