హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలను కాపాడిన వర్షాలు

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో రైతులు వేసిన పంటలను వర్షాలు కాపాడాయి. జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో దాదాపు పది రోజులుగా వర్షాలు కురవలేదు. దీంతో రైతులు పొలాల్లో తేమ శాతం తగ్గడంతో పత్తి, తదితర పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. మూడు మండలాల్లో తేలిక పాటి నుండి మోస్తారు వర్షాలు పడడంతో పంటలకు ప్రాణం పోసినట్లు అయింది.