హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో మారిన వాతావరణం.. పట్టపగలే కారు చీకట్లు!

GNTR: తెనాలిలో శనివారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం పూర్తిగా మబ్బులతో కమ్ముకోవడంతో పట్టపగలే కారు చీకట్లు అలుముకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉదయాన్నే చిరుజల్లులతో వర్షం ప్రారంభం కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారిన క్లైమెట్‌తో పట్టణంలో చల్లటి వాతావరణం నెలకొంది.