WNP: అమరచింత మండలం నందిమల్లలో మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఇంటెక్ వెల్ మోటార్ కాలిపోవడంతో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి హుటాహుటిన మోటార్ మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
తెలంగాణ
తాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రి


