KRNL: ఆస్పరి మండలం రామతీర్థం క్రాసింగ్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి అమ్ముకొని తిరిగి వస్తుండగా మంత్రాలయం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆలిగేరి గ్రామానికి చెందిన గొల్ల మారుతి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గొల్ల రమేశ్‌ను ఆదోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బస్సు ఢీకొని వ్యక్తి మృతి.. వ్యక్తికి గాయాలు


