హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఆకారంలో విద్యార్థుల సందడి

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు గణేష్ ఆకారంలో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమవారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను చూసి పాఠశాల సిబ్బంది అభినందించారు.