MHBD: బయ్యారం మండల కేంద్రంలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన మేకల పర్వతాలు (65) ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మూడు రోజుల క్రితం భార్యతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలుపు మందు తాగారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్ బాబు తెలిపారు.
తెలంగాణ
కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి


