హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ అలవాటు ప్రమాదమే?

ఉదయం లేవగానే ఫోన్‌ తీసుకుని సోషల్‌ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ చూడటం అలవాటుగా మారింది. అయితే ఇలా చేయడం వల్ల రోజు ప్రారంభంలోనే మనస్సుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే ఫోన్‌ చూడటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడంతో పాటు, ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.