హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడి ఆత్మహత్య!

JGL: ఎండపల్లి మండలం గుళ్లకోటలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ వేడుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అకాల మరణంతో పార్టీ శ్రేణులు, మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.