NZB: సిరికొండ మండలంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గత 15 రోజులుగా వర్షాలు లేక పొట్ట దశలో ఉన్న వరి, ఇతర పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందిన రైతులకు తాజా వర్షంతో ఊరట లభించింది. పంటలకు కీలక దశలో వర్షం కురవడంతో దిగుబడికి మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: సిరికొండలో జోరుగా వర్షం.. రైతులకు ఊరట


